సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 స్వాంతము...సాంత్వనము
*****
స్వాంతము సాంత్వనము ...ఈ పదాలను చూసినప్పుడు ఒకేలా భావిస్తాం కానీ ఆ రెండు పదాల అర్థాలు వేరు వేరని గ్రహించాలి.
స్వాంతము అంటే మనసు. మనసు చంచలమైనది. కోరికల పుట్ట. ఒక చోట నిలకడగా ఉండ నీయకుండా,కనబడిన వాటి వెంట పరుగులు తీస్తూ ఉంటుంది.
 నచ్చిన, మెచ్చిన వాటినో, రుచికరమైన వాటినో చూసినప్పుడు స్వాధీనం తప్పుతుంది.
 పంచేంద్రియాలు కూడా స్వాంతమును అదుపులో ఉండ నీయవు.వ్యామోహాల ఊబిలోకి నెడుతుంటాయి.
అదుపు తప్పిన స్వాంతము చేసిన పొరపాట్ల వల్లనే సమాజంలో విలువలు కోల్పోతూ వుంటారు.అలాంటి వారికి ఎలాంటి సాంత్వనము లభించదు.సరికదా దోషిగా అందరి ముందూ నిలబడే పరిస్థితి ఎదురవుతుంది.
స్వాంతము ఎల్లప్పుడూ సాంత్వనముతో నిండి ఉండాలి.
సాంత్వనము అంటే జాలి, దయ ,కరుణ, ఆదరణ లాంటి సాత్విక భావనలతో కూడిన ఓదార్పు .మానవతా విలువలు నిండిన అంతరంగం.
సాంత్వన వచనాలు అంటే ఓదార్పు మాటలు.
 ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు