కె.వి.ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులకు క్విజ్ పోటీలు.

 స్థానిక కె.వి.ఆర్ గార్డెన్, కర్నూలు లోని కె.వి.ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో లైబ్రేరియన్ బోయ శేఖర్,స్కూల్ ఇంచార్జీ ఉపాద్యాయులు రజినీ గారు,తెలుగు ఉపాద్యాయులు రాజేష్ గారు మరియు ఉపాధ్యాయుల సమక్షంలో స్కూల్ విద్యార్థిని,విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది.పోటీలో గెలుపొందిన విద్యర్థులు 9వతరగతి ఏశ్వంత్, సుభోదిప్,8వతరగతి అస్మ కౌజర్,మాహీన్,7వతరగతి అయేషా, ఆఫ్సన,6వతరగతి మిజాన్, మీజ్బా విజేతలకు,రన్నర్ష్ కు ఈనెల 14వ తారీకు గ్రంథాలయ,స్వాతంత్ర్య సమర యోధుడు,సాహితీ వేత్త గౌ శ్రీ.గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు గారి 139వ జయంతి సందర్భంగా భాహుమతులను కె.వి.ఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎం.డీ గౌ,శ్రీ సాధు శ్రీనివాస రెడ్డి గారు విద్యార్థిని,విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేస్తారని తెలియజేశారు.
కార్యక్రమంలో లైబ్రేరియన్ బోయ శేఖర్ మాట్లాడుతూ విద్యార్థిని,విద్యార్థులు పాఠశాల స్థాయి నుండి లైబ్రరీ యొక్క అవశ్యకత తెలుసుకోవాలని,గ్రంధాలయాలు మీ బంగారు భవిష్యత్తుకు మార్గ నిర్దేశం చేస్తాయని.
కావున విద్యార్థి దశలోనే లైబ్రరీకి వెళ్ళి అక్కడ పుస్తకాలను,వార్త చదవడం అలవాటు చేసుకోవాలని,భవిష్యత్తులో మీరందరూ గొప్ప మేదావులు అవ్వాలని కోరుతూ సందేశాన్ని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ బోయ శేఖర్, హై స్కూల్ ఇంచార్జీ ఉపాధ్యాయురాలు రజినీ గారు, తెలుగు ఉపాధ్యాయుడు రాజేష్,ఉపాద్యాయులు మరియు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారని స్కూల్ లైబ్రేరియన్ బోయ శేఖర్ తెలియజేశారు.
కామెంట్‌లు