ప్రకృతి కి తల వంచాలి; - డాక్టర్ . కందేపి రాణిప్రసాద్
ప్రకృతి లో ఒక చిన్న కణం మనిషి
ప్రకృతి లో ఒక బుల్లి జీవం మనిషి
ప్రకృతి లోఒక చిన్ని ప్రాణం మనిషి
ప్రకృతి లో ఒక బుజ్జి జవం మనిషి

అన్నీ తెలుసు అనుకునే మనిషి
అన్నీ కనుక్కున్నారు అనే మనిషి
అంతా నా ప్రతాపమే అనే మనిషి
అంతా నాకే తెలుసు అనే మనిషి

ప్రకృతి పై పెత్తనం చెలాయించే మనిషి
ప్రకృతి నీ అదుపు లో పెట్టాలనే మనిషి
ప్రకృతి నీ చెప్పు చేతల్లో ఉంచుకునే మనిషి
ప్రకృతి నీ అణగ దొక్కాలనుకునే మనిషి

మరి
ప్రకృతి పగబడితే మనిషి లేకుండా పోతాడు
కరోనా లాంటి వైరస్ లు విజృoభిస్తాయి
సునామీ లాంటి తుఫాన్లు ఉవ్వెత్తున ఎగుస్తాయి
ఉత్తారా ఖంద్ వరదల్లా ముంచెత్తు తాయి.

ప్రకృతి నీ అనుసరించి నడవాలి
సకల జీవరాశులు నీ బతక నివ్వాలి
ప్రకృతి లో మమేకమై జీవించాలి
ప్రకృతి కి తల వంచి బతకాలి

కామెంట్‌లు