లోకాలనేలు వాడు (మణిపూసలు);-ఎడ్ల లక్ష్మి
వనములోని పూలలో
గొల్లభామ మనసులో
దాగి ఉన్న కృష్ణుడు
కానరాడు కనులలో

అల్లరి పనుల కృష్ణుడు
ఆటలాడు చిన్నోడు
గొల్లబామలింటి లోన
వెన్న ముద్దల చోరుడు

నెత్తి మీద నెమలీక
హస్తమున మురళి పీక
అతనివెంట చూడగా
అల్లరి చేసే మూక

ఊరు వాడలో నతడు
పల్లె పురములో నతడు
నల్లనైన రూపులో
నంద గోవిందుడతడు

పాపాలు నిండినప్పుడు
అవతారము నెత్తియతడు
కలికి రూపమందున
లోకాలను ఏలు తాడు


కామెంట్‌లు