సున్నితం ద్వితీయ వార్షికోత్సవ వేడుక; -డా : సూర్యదేవర రాధారాణి
 సాహితీ బృందావన జాతీయ వేదిక
ప్రక్రియ: సున్నితం
రూపకర్త:శ్రీమతి నెల్లుట్ల సునీత
=============================
516)
ప్రతివారం  మామేధస్సుకు పనిచెప్తూ.. 
వివిధమైన అంశాలను మాకిస్తూ ..
ప్రియప్రక్రియ సున్నితములో రాయిస్తూ..
చూడచక్కని తెలుగు సున్నితంబు!
517)
ముచ్చటగా త్రిపదములు గుదిగుచ్చుతూ.. 
తెలుగుభాష తీపిదనం కుమ్మరిస్తూ.. 
నవరసములూ నాణ్యముగా ఒలికిస్తూ..
చూడచక్కని  తెలుగు  సున్నితంబు !
518)
అర్ధసహస్రం సున్నితాలు అలవోకగా !
అడుగడుగునా వెన్నుతడుతూ తోడుగా !
నిలిచారుగా నెల్లుట్లగారు మెట్లుగా!
చూడచక్కని తెలుగు సున్నితంబు!
519)
తొమ్మిదే పదములను మలుస్తూ ..
లఘుకవితగా సున్నితాన్ని ఆవిష్కరిస్తూ ..
సారాంశాన్ని అందులోనే పొందుపరుస్తూ..
చూడచక్కని  తెలుగు  సున్నితంబు !
520)
అతిసున్నితముగా రెండేళ్ళు పయనం !
అనాయాసముగ బిరుదులు  అందుకున్నాం!
సమూహపెద్దలకు వందనాలు సహస్రం!
చూడచక్కని తెలుగు సున్నితంబు !!


కామెంట్‌లు