సుప్రభాత కవిత ; -బృంద
పాతుకున్న బంధాలు
ఏనాటికీ మాసిపోవు

క్షణములన్ని గతములైన
తలపులన్ని  తాజాగనే

కనుతడవని గమనంలేదు
కలలు కనని నయనం లేదు

తిమిరంలో అడ్డంకులు
వెలుగుల్లో  మాయమౌను

మాయలెన్నో కమ్మబోయినా
కరిగిపోని నిర్ణయాలు
అలల తాకిడికి శిలలు
కరిగేనా?

నిర్ణయం స్థిరమైతే
గమ్యం నిర్దిష్టమౌను

దారి మారవచ్చు కాని
దారి తప్పరాదు

వెలుగు వచ్చువరకు మాత్రమే
చీకటి రాజ్యం

మేలిపొద్దుకై వేచిన మది పాడే

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు