సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 నేర్చుకో... తీర్చుకో...
   *****
నేర్చుకోవడం అనగానే ఇది విద్యార్ధులకు సంబంధించిన విషయం కదా అనిపించ వచ్చు. కానీ వ్యక్తులుగా జీవితంలో మనమంతా విద్యార్థులమే..నేర్చుకోవడం అనేది ప్రతి వ్యక్తి జీవిత పర్యంతం జరుగుతూనే ఉంటుంది.
అది కొన్ని సార్లు మనకు తెలియకుండానే జరుగుతుంది. అదే అనుభవాల పాఠం. ఆ పాఠమే మనకు గుణపాఠమై ఎలా ఉండాలో ఉండకూడదో నేర్పుతుంది.
నేర్చుకోవాలనే తపన ఉండాలే కానీ మనల్ని మనం ఉన్నతంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దుకునే అవకాశాలు,అంశాలు, కళలు ఎన్నో ఉన్నాయి.
 అయితే నేర్చుకోవాలనే కోరిక ఉన్నప్పుడు  వాటికి సంబంధించిన సందేహాలను తప్పకుండా తీర్చుకోవాలి.
 అప్పుడే మన అభ్యసనంలో, అభ్యాసం లో స్పష్టత వస్తుంది. నేర్చుకునే దారి సుగమం అవుతుంది.అందులో మన నైపుణ్యం, ప్రతిభ సామర్థ్యం వెలుగులోకి వస్తాయి.
నేర్చుకోవడం వల్ల మనలోని అసంతృప్తులు తొలగి పోతాయి. ఆశలు ఆశయాలు తీర్చుకునే అవకాశాలు కలుగుతాయి. నిత్య జీవితం ఉత్సాహంగా ఉల్లాసభరితంగా సాగిపోతుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు