* మళ్ళీ... మళ్ళీ *- కోరాడ నరసింహా రావు

 ఈ జీవనది ఆ కడలిలో... 
  కలసిపోవాల్సిందే.... !
యే కష్టాల ఎర్రని ఎండలకు 
  ఆవిరై పోయినా...., 
      నల్లని మేఘం లా... 
        మారిపోయినా... 
    సుఖ -  దుఃఖాల  గాలి 
      ఒత్తిళ్లకు... కరిగి జల - జలా రాలిపోయినా....., 
  జీవనదిగానే అవతరించాలి 
..  పరీవాహకమంతా... 
  పచ్చదనంతో నింపుతూ... 
 ఆర్తులకు ఆకలి -  దప్పులు 
తీరుస్తూ.,ప్రకృతికిఅందాన్నిచ్చి
ఆహ్లాదపు ఆనందాన్ని పంచు కుంటూ... పోయి, 
మళ్ళీ నా నిజ స్థానాన్ని చేరుకుంటూనే ఉంటాను.... !
      ******
కామెంట్‌లు