# ఎలుగెత్తుమీరు చాటండి #( బాలగేయం *)--కోరాడ నరసింహా రావు
మీరు  అన్నా'చెల్లెళ్లు 
  వాళ్ళు  అక్కా'తమ్ముళ్ల ?
   ముద్దొచ్చే పిల్లలు మీరు 
    అమ్మా,నాన్నలమురిపాలు!

కలిసి ఆటలు ఆడండి 
  చక్కగ షికార్లు చెయ్యండి 
    అల్లరి చెయ్యవద్దంది 
      బుద్ధిగ మీరు ఉండండి !

దెబ్బలాడుకోవద్దంది 
 స్నేహంగా ఉంటే ముద్దండి 
   శ్రద్దగా మీరు చదవాలండి 
     గొప్పవారిగా ఎదగాలండీ!

 పెద్దవారయి మీరంతా 
  విడిపోయి యేఊర్లలొ  ఉన్నా 
    మీ స్నేహాన్ని వీడ వద్దండి 
       వీలైనప్పుడు కలవండి !

కష్ట, సుఖాలను పంచుకుని 
  కడదాకా కలిసి ఉండండి 
   స్నేహం లోని గొప్పతనాన్ని 
     ఎలుగెత్తి మీరు చాటండి !!
     *******

కామెంట్‌లు