స్వతంత్ర భారతి; - అద్దంకి లక్ష్మి-ముంబై
ప్రక్రియ సున్నితం
==============
లక్ష్మీబాయి జాతీయ సంగ్రామము
 చంద్రబోస్ సాయుధపోరాటము
  తెల్లదొరల అరాచకపు పరిపాలన
చూడచక్కని తెలుగు సున్నితంబు


శాంతి అహింసా సత్యాగ్రహము
 శతాబ్దాల పోరాట ఫలితము
గాంధీనెహ్రూ వీరుల త్యాగఫలితము
చూడచక్కని తెలుగు సున్నితంబు


ప్రజాస్వామ్య విధానము ప్రసిద్ధము
సమసమాజ నిర్మాణమే ప్రధానము
స్వతంత్ర న్యాయవ్యవస్థ భారతం
చూడచక్కని తెలుగు సున్నితంబు


భారత స్వాతంత్ర్య అమృతోత్సవాలు
ఎగురుతోంది ఇంటింటిపై మనజెండా
రంగరంగాలలో దేశప్రగతి నిండా
చూడచక్కని తెలుగు సున్నితంబు


సాంకేతిక మేథస్సుతోయువతరం  
ఎగురవేయాలి విజయ పతాకం
కులమత వర్గభేదాల నిర్మూలనం
చూడచక్కని తెలుగు సున్నితంబు

కామెంట్‌లు