చిత్రలేఖన పోటీలో జక్కాపూర్ విద్యార్థినికి బహుమతి


 షార్ వాణి పత్రిక (శ్రీహరి కోట,నెల్లూరు) విజయ దశమి పర్వదిన సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖన జాతీయ స్థాయి పోటీలో  సిద్దిపేట జిల్లా లోని జక్కాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని కయ్యాల నిఖిత  తృతీయ బహుమతి గా 600 రూపాయల నగదు గెలుచుకుంది. బహుమతి గ్రహీత నిఖితను,ప్రోత్సహించిన ఉపాధ్యాయులు భైతి దుర్గయ్య ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాళ్లబండి పద్మయ్య,ఉపాధ్యాయులు అభినందించారు.
కామెంట్‌లు