ధ్యేయం ...!!; -మాటలు ఆన్షి వి;-రాతలు...తాతవి> డా.కెఎల్ వి ప్రసాద్.
నేను పెద్దయ్యాక 
ఏమౌతానని 
ఇప్పుడే -అప్పుడే 
చెప్పమంటే ....
ఏమిచెప్పేది ...
ఏమని చెప్పేది ?
మాఅమ్మ 
పదునాలుగేళ్లకే 
చెప్పేసిందట ...
విజ్ఞాన శాస్త్రంలో 
పరిశోదన చేస్తానని 
వైధ్య శాస్త్రం మాత్రం 
చదవబోనని ....!
అమ్మ ....
సైన్టిస్ట్ కాబోయి
ఆకాశవాణికి
అంకితం అయింది !
నాగురించి --
ఎవరు ఏమి 
ఊహించుకున్నా ,
నేనుమాత్రం --
డాక్టరునౌతా ...!
ఎందుకంటే ----
మాతాత ..
డాక్టరు కదామరి ..!!

            ***

కామెంట్‌లు