కె.వి.ఆర్ పాఠశాల లైబ్రేరియన్ బోయ శేఖర్ కు గాడిచెర్ల ప్రోత్సహక పురస్కారం.

 కర్నూలు జిల్లా గ్రంథాలయంలో జరిగిన గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు గారి 139వ జయంత్యుత్సవం సందర్భంగా గాడిచెర్ల పురస్కార కార్యక్రమంలో గౌ,శ్రీ T.G వెంకటేష్,గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గౌ,శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్,గౌ,శ్రీ కె.చంద్రశేఖర కల్కూర గారి చేతుల మీదుగా స్థానిక కె.వి.ఆర్ గార్డెన్ లోని కె.వి.ఆర్ హై స్కూల్ లైబ్రేరియన్,కవి,రచయిత,చిత్రకారుడు బోయ శేఖర్ గాడిచెర్ల ప్రోత్సహక పురస్కారం అందుకున్నారు.
తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు మరియు విద్యార్థిని,విద్యార్థులకు గ్రంథాలయం అవశ్యకతను తెలియజేస్తూ విద్యార్థులకు గ్రంథాలయం,పుస్తక పఠనం పై మక్కువను పెంపొందిస్తునందుకు లైబ్రేరియన్,కవి,రచయిత,చిత్రకారుడు బోయ శేఖర్ కు గాడిచెర్ల ప్రోత్సహక పురస్కారం అందుకోవడం జరిగింది. కె.వి.ఆర్ హై స్కూల్ లైబ్రేరియన్ బోయ శేఖర్ కు గాడిచెర్ల ప్రోత్సహక పురస్కారము రావడంతో ప్రిన్సిపాల్ సాధు శ్రీనివాస రెడ్డి,ఉపాద్యాయులు మరియు కుటుంబ సభ్యులు లైబ్రేరియన్ బోయ శేఖర్ కు అభినందనలు తెలియజేశారు. 

కామెంట్‌లు