:స్వతంత్ర భారతం; -డా.మరుదాడు అహల్యా దేవి--హైదరాబాద్
 సాహితీ బృందావన జాతీయ వేదిక
ప్రక్రియ:సున్నితం
------------------------------
16.
గాంధీజీ ఆశయాలు నెరవేరినవేళ
నెహ్రూ కన్నకలల భారతమిది
ఝాన్సీరాణి శూరత్వ ఫలితం
చూడచక్కని తెలుగు సున్నితంబు
17.
తెల్లవాడి బానిసత్వం నుండి
కబంధ హస్తాల చెరనుండి
కాపాడిన త్యాగధనుల మరువొద్దు
చూడచక్కని తెలుగు సున్నితంబు
18.
మాకొద్దీ తెల్ల దొరతనమని
నినాదాలు ఉద్యమాలుగ మారి
సాధించిన స్వతంత్ర భారతం
చూడచక్కని తెలుగు సున్నితంబు
19.
అహింసనే ఆయుధంగా చేసి
ధర్మ చక్రాన్ని శాంతిదూతగా
వందేమాతర గీతం మోగేను
చూడచక్కని తెలుగు సున్నితంబు
20.
తెల్లదొరలకు ఉద్వాసన చెప్పి
త్రివర్ణ పతాకం త్రిశూలంకాగా
జాతీయ జెండా ఎగిరింది
చూడచక్కని తెలుగు సున్నితంబు


కామెంట్‌లు