సుప్రభాత కవిత ; -బృంద
ఏటి నీటిలోకి
సూటిగా వెళ్ళి
మనసు మీటి
మమతలు కోటి

మేలుకొలిపే తరుణాన
జలతారు కిరణాల

జిలుగులన్ని చూసుకుని
వెలుగు చీర చుట్టుకుని
మురిసి ముక్కలయే నీరు

అలసట లేని ఆనందం
తనివే తీరని అనుభూతి
నిరాశ పొందిన నీరసం
హుషారు తరగని ఉత్సాహం

ఉషోదయపు ఊసులు
ఎడతెగని  తలపులు
గురుతురాని తెగిన అలలు
చేరువ కాని తీరాలు

నిన్న జరిగినది మారదు
రేపు ఏమవునో తెలియదు
ఈ క్షణం ఆనందం మన సొంతం

అవధిలేని అనందాలు అందించు
అరుణోదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు