చులకన జూడకు; -సాహితీసింధు సరళగున్నాల
చీమచిన్నదనుచు చిన్నచూపేలనో
చూచినేర్చుకొనగ దాచురీతి
పద్దతైననడక పనిజేయునోర్పుతో
దినికన్నమిన్న ధరణిలేదు

చులకనజేయు మానవుల 
జూచినలోపములెన్నియోగనన్
తలపున నీచబుద్ధి మది ధర్మముదప్పెడి తప్పుదారులన్
వెలుపల జూడ మేకవలె వెర్రియుతట్టెడు మందలోపలన్
కలతలురేపు వారునిల గాంచినవీధికినెందరెందరో

కాకి రంగుజూచి పాకివారలకన్న
హీనమైనదనుచు హేళనమ్ము
సలుపువారు, వారి సంస్కృతి మరిచేరు
పిండమదియెగొనక పీడయనిరె

పేదవారుననుచు పిలిచి చిన్నగబుచ్చి
హేళనమ్ముజేయు హీనజనులు
ధనమునొక్కచోట మనలేదు మారుచున్
వారిజేరునాడు దారియేది?

కామెంట్‌లు