సుప్రభాత కవిత ; -బృంద
దిక్కు తోచని వేళ
దిక్సూచిలా వెలుగుతూ

చీకట్లో కుమిలిపోతుంటే
వెలుగు రేఖలు చిమ్ముతూ

మెదడు మొద్దుబారితే
చురుకుదనాన్నిస్తూ

గమ్యమే కనిపించక
తిరుగాడే మనసుకి 
దిశానిర్దేశనం చేస్తూ..

ఎత్తుపల్లాలు గోచరించేలా
దారిదీపం అవుతూ

ఓడిపోని మనసుకు
తోడుగా చేయందిస్తూ

నిరాశతో మూగబోయిన
గుండెలో  ఉత్సాహం  పొంగిస్తూ

అసహాయతకు ఆసరాగా
ఆత్మీయతనిచ్చే నేస్తంగా

ఆరిపోతున్న ఆత్మవిశ్వాసానికి
అవసరంగా అందించే ఆజ్యంగా

ఆనందాల నిధికి మార్గం చూపిస్తూ
దూరాలు చేరువ చేసే 

ఉదయపు కిరణాల
చరణాలకి  ప్రణమిల్లుతూ

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు