నవ్వులలోకం;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
నవ్వు
నవ్వితే
నవరత్నాలు
రాలవులే

నవ్వు
నవ్వితే
నాపచేను
పండునులే

నవ్వు
నవ్వులనదిలో
పువ్వులపడవెక్కి పయనించి 
పరమానందము పొందుములే

నవ్వు
నాలుగందాల చేటని
నువ్వు
నమ్మకులే

చిట్టిపాప
నవ్వితే
పరవశం
కలుగునులే

పడుచుపిల్ల
నవ్వితే
అందము రెట్టింపయి
ఆనందము కలుగునులే

దయచేసి
నువ్వు నవ్వు
నలుగురిని 
నవ్వించు

నవ్వు
నవ్వకపోతే
నువ్వు
నీరసించిపోతావు

నవ్వులలోకంలో
విహరించు
నిత్యానందాన్ని
అనుభవించు


కామెంట్‌లు