నేటి చదువులే (బాలల గేయం )పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.
గురువులు తప్పక వస్తారు
 బోధనలు ఎన్నో చేస్తారు
ఊరక ఉండుట మంచిది కాదు
 ఉన్న పుస్తకం చదవర ముందు

 జ్ఞాన విషయాలు వినాలి 
వాటిని మననం చేయాలి
 మాటలతోనే చెప్పాలి 
గురువు మెప్పులే పొందాలి

 వాయిదాలు అసలే వద్దు
 కొద్దిగానైనా చేయరా ముందు
 విత్తనమే వృక్షమై నట్లు 
నేటి చదివే రేపటి గౌరవం.

కామెంట్‌లు