అర చేతిలో చరవాణి;-చంద్రకళ యలమర్తి
చరవాణి ఆకర్షణ లోయావత్ ప్రపంచం ఊగిసలాడుతోంది

అర చేతిలో చరవాణి వుంటే
స్వర్గం మీ అరచేతిలో వున్నట్లే
ఆదమరిస్తే అమాంతం నరకం లోకి
వెళ్ళినట్లే

ప్రపంచంలోని ఏ దేశం వారితో నయినా మాట కలపొచ్చు
వార్తలు,వింతలు విడ్డూరాలు అడగొచ్చు 
అవి చిటికెలో మీ చెవి చేరచ్చు

ఏంచూడాలన్నాక్షణంలోచూడొచ్చు 
సినిమాలు, నాటకాలు, పాటలు
ఎన్ని సార్లయినా వేసుకోవచ్చు
పాఠాలు, వ్యాసాలు,చరిత్రలు
చిటికెలో విద్యార్థులకు అందించు

వినాశకాలే విపరీత బుద్ధిఅన్నట్లు చెడుదారి పడితే అధోగతే
తమ గొయ్యి తాము తీసుకున్నట్లే

నేడు పిల్ల, జెల్ల, ముసలి,ముతక
చరవాణి మోజులో 
మునిగి,మురిసి పోతున్నారు

 పిల్లల బాధ్యత తల్లి తండ్రులదే
పెద్దలారా దాచుకున్న సొమ్ము 
దోచుకునే దొంగలు కోకొల్లలు

మంచి చేసేవారు
మనల్ని ముంచి వేసేవారువున్న
మాయలోకంలో, ఇది 
మాయల ఫకీర్ చేతి మంత్రదండం 
"తస్మాత్ జాగ్రత్త"!

"అతి సర్వత్రా వర్జయేత్ "అన్న
చద్ది మూట లాంటి పెద్దల మాట
గుర్తు పెట్టుకున్న వారు ధన్యులు
***


కామెంట్‌లు