అదృష్టం "బాలికలు";--గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
నింగిలో తారకలు
నేలపై బాలికలు
గృహంలో దీపికలు
ఓ వెన్నెలమ్మ

ఆనంద వీచికలు
అవనిలో వేడుకలు
అందాల మాలికలు
ఓ వెన్నెలమ్మ

ఉజ్జీవ గీతికలు
విలువైన కానుకలు
జగతిలో బాలికలు
ఓ వెన్నెలమ్మ

ఉపశమన మూలికలు
సొగసైన చంద్రికలు
అదృష్టము బాలికలు
ఓ వెన్నెలమ్మ

అనురాగ వేదికలు
ఆరోగ్య సూచికలు
బాలికలు దేవతలు
ఓ వెన్నెలమ్మ

సృష్టిలో రతనాలు
చదివితే బాలికలు
ప్రగతికిల వంతెనలు
ఓ వెన్నెలమ్మ


కామెంట్‌లు