సునంద భాషితం ;-వురిమళ్ల సునంద,ఖమ్మం
 
జీవితం... జీవనం...
   *****
జీవితం, జీవనం రెండూ ఒకేలా అనిపించినా  అర్థాలు వేరు.
జీవితం అంటే జన్మించినప్పటి నుండి మరణించేంత వరకు సాగే ప్రయాణం.
జననం ,మరణం తప్పని ప్రయాణంలో ఒక్కొక్కరిది ఒక్కో రకమైన జీవితం.
ఉద్విగ్నతలు,ఉద్వేగాలు, ఆశలు,ఆశయాలతో కూడి ఉంటుంది.
జీవితాన్ని గడిపే విధానాన్నే జీవనం అంటారు.
ఒక్కొక్కరిది ఒక్కో రకమైన జీవన శైలి. కొందరు సాదా సీదా జీవనాన్ని ఇష్టపడితే,కొందరు విలాసవంతమైన జీవనాన్ని గడుపుతూ  తమ హోదాను ప్రదర్శిస్తూ ఉంటారు.
అసలైన జీవనం అంటే అనవసరమైన విలాసాలు, వినోదాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్నతమైన ఆలోచనలు, సానుకూల వైఖరితో ఆశయాల సాధనకై సాగిపోవడమే... 
జీవితం సంతృప్తిగా గడపాలంటే జీవన శైలి బాగుండాలి.జీవన శైలి బాగుండాలి అంటే జీవితం మానవీయ విలువలతో కూడి ఉండాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు