సున్నీతం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ;:ఎల్.గంగాధర్
సాహితీ బృందావన జాతీయ వేదిక 
ప్రక్రియ :సున్నితం
రూపకర్త: నెల్లుట్లసునీతమేడం 
========================
సుకవనాలు రాసిందెందరో అప్పుడు 
సుకవులు పలికింది ఇప్పుడు 
సుందర పదాలు ఒలిగిందిప్పుడు 
చూడ చక్కని తెలుగు సున్నితంబు 

నీతి విలువలకె ప్రాధాన్యం 
నీలము నింగికి అనన్యం
నీటివాగుల‌ పరుగులకు మాన్యం 
చూడ చక్కని తెలుగు సున్నితంబు 

తమ్ముల రేకులె నయనాలై 
తరళ సరళాల గమకాలై
తళుకు జిగులు పాదములై
చూడ చక్కని తెలుగు సున్నితంబు 

గానము పాదములతో  కదంతొక్కెను 
గానవి గమకాలతో ప్రవేశించెను 
గాత్రం సున్నితాలతో కలిసిపోయెను 
చూడ చక్కని తెలుగు సున్నితంబు 

రుచుల సమాహారపు సున్నితాలు
రుగ్మతలను తెలిపిన కవనాలు
రుషిలా బోధించిన సున్నితంబులు 
చూడ చక్కని తెలుగు సున్నితంబు 


కామెంట్‌లు