ఇంటర్ ద్వితీయ ఫలితాల్లో ఎస్ఎల్బి విజయ ఢంకా*;-వెంకట్ మొలక ప్రతినిధి: వికారాబాద్ జిల్లా  * ఎంపీసీ బైపిసి మార్కుల్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ లు*
- * ఎంపీసీలో తేజశ్రీ 467, బైపిసిలో అక్షయ436 మార్కులతో ప్రతిభ*
శభాష్ అనిపించుకున్న ఎస్ఎల్బి విద్యార్థినిలు*
వికారాబాద్:* ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని సంఘం లక్ష్మీబాయి గురుకుల (బాలికల) కళాశాల విద్యార్థినిలు విజయ ఢంకా మోగించారు. జిల్లాలోని కాకుండా రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకులు సాధించి జిల్లా ప్రతిభ కిరీటాన్ని ధరించారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో అత్యధికంగా మార్కులు సాధించి తమ చదువు ప్రతిభను చాటారు. ఎంపీసీ గ్రూపులో విద్యార్థిని తేజశ్రీ 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి స్టేట్ సెకండ్ ర్యాంక్ దక్కించుకున్నారు. అలాగే బైపిసి లో విద్యార్థిని అక్షయ 440 మార్కులకు గాను 436 మార్కులు సాధించి స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు. కళాశాలలో ఎంపీసీ, బైపిసి గ్రూపులల్లో 78 మంది విద్యార్థినులకు గాను 400మార్కులకు పైగా 68 మంది విద్యార్థులు  సాధించడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గోపిశెట్టి రమణమ్మ, బోధనా సిబ్బంది అభినందించారు. చదువులో ప్రతిభ చాటే ఎందుకు తేజశ్రీ అక్షయ లను అనుసరించాలని సూచించారు. సందర్భంగా పాఠశాలలో విద్యార్థినీలను అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు.
కామెంట్‌లు