సుప్రభాత కవిత ; బృంద
రెప్పలు దాటని
స్వప్నాల వేదన
కన్నీటి లో కరిగేదేనా?
కనులముందు నిజమై
నిలిచేలా  కష్టపడమా?

ఎంత ఎత్తుకు కెరటం
ఎగిరినా ఆకాశం అందేనా?
అందదని  అర్థం అయినా
అలుపెరగని ప్రయత్నం ఆపేనా?

తీరాన్ని దాటాలని 
పరుగులు తీసే అలకు
కోరిక తీరేనా?
అసంభవమని తెలిసినా
అలుపు అలకు ఉందా?

కష్టాలు వచ్చాయని
కాలం కలిసిరాలేదని
పయనం  ఆపేస్తామా?
గమనమే గమ్యంగా
బ్రతుకులో సాగిపోమా?

చీకటొచ్చేసిందని
రాత్రి భయపడితే
వెలుగు రాక వుంటుందా?
చీకటి  మాయం కాక
మనతోనే ఉంటుందా?

ఏది వచ్చినా ఇదే నాకోసం
అని భావిస్తే....
తృప్తిగా జీవితం నడచిపోక
ఆగిపోతుందా?

జీవనచక్రపు మరోమలుపు
అదిగో చూడు పొద్దుపొడుపు!

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు