బాల సాహిత్యానికి" పెద్దన్న"--గరిపెల్లి అశోక్:..;-యాడవరం చంద్రకాంత్ గౌడ్--సిద్దిపేట
 2019 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి అవార్డుకు ఎంపికైన సందర్భంగా.....
=============================================================
చదువు ఒక్కటే కాదు ఆటపాటలు, విజ్ఞాన విహారయాత్రలు కళలు సంస్కృతి సాంప్రదాయాలు వేడుకల్లా నిర్వహించడంలో భాగంగా చేసిన కృషికి నిదర్శనంగా బడి, ఉపాధ్యాయులు అందరి సహకారంతో అన్ని సాధ్యమే అంటారు శ్రీ గరిపల్లి అశోక్ గారు.కేవలం పాఠ్య పుస్తకాలకు పరిమితం కాకుండా సహ పాఠ్య అంశాల పట్ల విద్యార్థులకు అవగాహన పెంపొందించడం ,ఆలోచన కలిగించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడమే ప్రధాన లక్ష్యంగా ఎంతో మంది బాలలను, బాలకవులుగా తీర్చిదిద్దారు.
బాలల పట్ల వారి వికాసం పట్ల సాహిత్యం పట్ల విశేషమైన అభిమానంతో తీవ్రంగా తపించే వ్యక్తి  అశోక్  .
బాల సాహిత్యంలో అజ్ఞాతంగా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ఒకవైపు బాల సాహిత్యకారుల్ని ఆదరించి వారి చేత రచనలు చేయించి ప్రచురణలు తీసుకురావడం మరొకవైపు అలసట లేకుండా అరమరికలు లేకుండా 
ఆరాటపడుతున్న కార్యశీలి ప్రతిభావంతులు .
తెలంగాణ స్వీయ రాష్ట్రం సిద్ధించాక తెలంగాణలో బాల సాహిత్యం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వెలగడానికి శ్రీ గరిపల్లి అశోక్ గారు చేసిన కృషి అసామాన్యమైనది. ఎన్నో సృజనాత్మక, బాల సాహిత్య కార్యశాలలు నిర్వహించడానికి వీరి ప్రోత్సాహ, సహాయ, సహకారాలు మరువలేనిది. తెలుగు రాష్ట్రాల సాహిత్య అభిమానులకు సుపరిచితుడు  అశోక్ గారు. బాలలను బాల కవులను ప్రోత్సహిస్తూ,
బాలసాహిత్యం విస్తరించడానికి  దిక్సూచి వంటి వారుగా చెప్పవచ్చు.
బాలల పట్ల, వారి వికాసం పట్ల 30 ఏళ్లుగా పరితపిస్తున్న అక్షర  సేద్యకులు అయిన శ్రీ గరిపెల్లి అశోక్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా భీముని మల్లారెడ్డిపేటలో పుట్టి, పెరిగినా, ఇంటర్ విద్యార్థిగా 17 ఏళ్ల వయస్సులోనే మొదటి కవిత సంపుటం "నాంది" ప్రచురించబడింది.
తెలుగు భాష ఉపాధ్యాయుని గా విధులు నిర్వర్తిస్తూ ముస్తాబాద్ బడి పిల్లల కథ సంకలనం "జాంపండ్లు"కు సంపాదకులుగా," ఆకుపచ్చని ఆశలతో" అనే మరో కవితా సంకలనానికి సహ సంపాదకులుగా ,"బాల చెలిమి" నుండి వెలువడిన తెలంగాణ బడి పిల్లల కథలు ప్రాజెక్టు కన్వీనర్ గా వ్యవహరించారు.
ప్రస్తుతం మానేరు రచయితల సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులుగా, రంగినేని పిల్లల పండుగ మానేరు మహోత్సవం మొదలు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన బాలల మేధో వికాస కార్యక్రమాలకు వెన్ను దన్నుగా నిలిచారు అశోక్ గారు.
అనుబంధాలు, ఆత్మీయతల గుర్తులు, జ్ఞాపకాలు, ఏదైనా పిల్లలకు నేర్పడానికి తను నేర్చుకుంటూ, నిరంతర విద్యార్థి గా పొందిన అనుభవాల సమాహారం ఎంకటి కథలు, బడి పిల్లల కథలు.. స్వచ్ఛ సర్వేక్షణ గాథలు "మా బడి కథలు"గా ప్రచురించారు.
ఎoకటి కథలు, మా బడి కథలు దాదాపు మూడు మాసాలు ఆదిలాబాద్ ఆకాశవాణి ద్వారా వేల మంది శ్రోతలను సంపాదించుకున్నాయి. అశోక్ గారి మరో కథా సంపుటి "సరికొత్త ఆవు_ పులి కథలు". అంతే కాకుండా బడి బువ్వ పేరుతో పెద్దక్క కథలను తేవడం విశేషం.
"మధురకవి దూడం నాంపల్లి రచనలు పరిశీలన విమర్శ" (2020 )
"బంగారు నెలవంకలు" బడి పిల్లల కథలు 2016 
(సహాయ సంపాదకులు) "కవితల సింగిడి" బడి పిల్లల కవితలు (2017)
" రఘుపతి రాఘవ రాజారాం" డాక్టర్ పత్తిపాక మోహన్ గాంధీ గేయాలు 2020 (సంకలనకర్త )
వంటి రచనలు అశోక్ గారి కలం నుండి జాలువారినవే.

ఇంత గొప్ప బాల సాహితీవేత్త శ్రీ అశోక్ గారికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2019 సంవత్సరానికి బాల సాహిత్య సేవను గుర్తించి, కీర్తి పురస్కారానికి ఎంపిక చేయడం తెలంగాణ ప్రజలకు ఎంతో సంతోషంను ఇచ్చింది.

కామెంట్‌లు