సోషల్ టీచర్ పాఠంముగించాక పిల్లలని రకరకాలుగా ప్రశ్నలు అడగడం వారు టకటకా జవాబులు చెప్పటంతో సంతోషించింది.తన పాఠం వారి బుర్ర లో బాగా దూరింది అనే తృప్తి కల్గింది. "సరే జి.కె.అడుగు తాను చెప్పండి.ప్రపంచ వింతలేంటి?" అంతే క్లాసంతా ఒక్క సారి గా "పిరమిడ్లు తాజ్మహల్ చైనా వాల్"అంటూ గడగడా చెప్పారు. కానీ ఆరోజే కొత్త గా చేరిన రోహిత్ మాత్రం మౌనంగా ఉన్నాడు. "ఏంబాబూ!కొత్త స్కూల్ కొత్త క్లాస్ అని భయపడుతున్నావా?" లాలనగా టీచర్ అడిగింది. వినయంగా లేచి నిలబడి రోహిత్ ఇలా అన్నాడు "కాదు టీచర్! నాదృష్టిలో అవి వింత లు కావు.దేవుడు మనకిచ్చిన శరీర భాగాలు మన అంగాలు విలువైనవి అద్భుతమైనవి! ఆలోచించే మెదడు కన్ను ముక్క చెవి నోరు కాళ్ళు చేతులు మన శరీరంలో ఉన్న గుండెతో సహా అద్భుత వింతలుకాదా? మనకు ఎలాంటి అంగవైకల్యం మానసిక జబ్బు లేకుండా సృష్టించిన ఆదేవుడు అద్భుతంకాదా? నేడు శరీర అవయవదానంతో చాలా మంది ప్రాణాలు నిలబడటమే గాక అంధులు దివ్యాంగులు లాభపడటం విశేషం! మంచితనం ఆప్యాయత ప్రేమ ఇతరులను ఉత్సాహ పరచటం అద్భుతం ". రోహిత్ మాటలు క్లాస్ అంతా నిశబ్దం గా విని ఆలోచనలో పడితే టీచర్ వాడిని దగ్గరకు పిల్చి ఆప్యాయంగా బుగ్గలు పుణికింది.పిల్లల చప్పట్లతో గది దద్దరిల్లింది 🌹
వింతలు! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి