ఓ మనిషీ.... ! కోరాడ నరసింహారావు.
సకలవాయువుల సమ్మిశ్రమ వలయం ఆ వినీలాకాసం !
 ఆ ఉదరములోనే హాయిగ ఉన్నది ఈ సృష్ఠి సమస్తం !!

ఆకర్షణ - వికర్షణల... భౌతిక రసాయన చర్యలతో...ఇదొక గొప్ప రక్షణ కవచం ! ఈ జగ తికి మూలము తానే.... !

సృష్ఠి, స్థితి, లయముల కావాస
మై... అంతుచిక్కని అద్భుతమై
అలరారుతున్నదీ అద్భుత గగన వృత్తం.... !

నీరు, గాలి, వెలుగుల నిచ్చి... 
ఈ భూమిని రక్షిస్తుంది !
 ప్రాణికోటిని పోషిస్తున్నది !!
  ఆ నింగి దైవమె తానై... !!

సృష్టిలో  యే  ప్రాణికీ లేని.... 
 వివేక, బుద్ది కుశలతల నిచ్చి 
 నిన్నే సంరక్షకునిగా... నియ మించెను ఓ మనిషీ.... !

కాలుష్యాల సెగలతో... నీవు 
కాలునివైపోతే, నీ ఉనికినే... 
 నువ్ కొల్పాతావు !కోరి తలకు 
కొరివి పెట్టుకోకుమా.... !!
    *******

కామెంట్‌లు