రాజభాష హిందీ ;-ఎం. వి. ఉమాదేవి -బాసర
ఆట వెలది 
==========
రాజభాష హింది రయమున నేర్వుము 
దేవనాగరి లిపి దివ్యముగనె 
యలరుచున్నదిపుడు నధికార భాషగా 
విశ్వ రెండవదిగ విమలభాష !!

దక్షిణమున వెల్గె దారిజూపగతామె  

ముప్పవరపు పీవి ముఖ్యముగను
హిందిభాష సిన్మ హెచ్చులాభము దెచ్చు 
జాతియతకు మేలు చక్కగాను!!

కామెంట్‌లు