చూడటానికి వెళ్ళాను;-- యామిజాల జగదీశ్
 గ్రీకు తత్వవేత్త సోక్రటీసుకి బజారువీధికి వెళ్ళి రావడమంటే మహా ఇష్టం. తరచూ ఆయన అలా వెళ్ళొస్తుండేవారు. 
ఈ విషయం తెలుసుకున్న మిత్రుడొకడు సోక్రటీసుని చూసి "అయ్యా! నీకు వస్తువులమీద పెద్దగా ఆశలు లేవని తెలుసు. కానీ నువ్వెప్పుడూ బజారువీధికి వెళ్ళొస్తుంటావు. ఒక్కరోజూ ఒక్క వస్తువూ కొన్నట్టు నేను చూడలేదు. మరెందుకు బజారుకి వెళ్ళడం" అని అడిగాడు.
అతనన్న మాటలన్నీ విన్న సోక్రటీస్ ఓ నవ్వు నవ్వి "నేను బజారు వీధికి వెళ్ళి రావడమే నిజమే. బజారులో నాక్కావలసిన వస్తువు ఉంటే కొనాలని వెళ్ళడం లేదు. నాకు ఆక్కర్లేని వస్తువులు ఎన్ని ఉన్నాయో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. అందుకే వెళ్ళొస్తుంటాను" అన్నారు.

కామెంట్‌లు