సుప్రభాత కవిత ; -బృంద
చీకటిని తరిమేసే వెలుగు

నేటిని నిన్న చేసే రేపు

గడచిన ప్రతిక్షణం గతమే

నిన్నటి అనుభూతులు
జ్ఞాపకాలుగా.

రేపటి కలలకు ఊపిరిగా

నేటి ప్రతిక్షణం ఉత్సాహంగా 

మార్చుకునే మనసుంటే

మౌనాలు గీతాలై
భావాలు మాటలై
ఊపిరి ఉయ్యాలై
గుండెసడి సరిగమలై
మనసు పాడే భావగీతం
కాదా మన జీవితం!

ఉరికే ఉత్సాహపు ఊతంగా
వచ్చే వెచ్చని ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు