రూపాంతరం!!? ప్రతాప్ కౌటిళ్యా
అడవిని చీకటి
పడగనిడలో దాచిపెట్టిన
దిష్టిబొమ్మల రాజ్యంలో
కాగడాల్లా కాలిపోతూ
వెలుగుకు వేగుచుక్కలా
మొలిచే అవకాశం వచ్చింది!!?

దాహం వేసినా అహం
ఆహారం కోసం వెతకదు
ఒక పులి రూపం కోసం
ఒక సింహం సింహాసనం కోసం
కాచుకుని వేచి ఉంటుంది!!?

అప్రమత్తమవ్వాల్సింది
జ్ఞానం అమాయకత్వం
వీధి వీధిలో వీధి నాటకం
వేయాల్సి వస్తుంది!!?

విత్తనం ఒకటే
మట్టే మారుతుందీ-ఈ దేశంలో!!?

నీరు ఒకటే
చెట్టే మారుతుంది-ఈ మట్టిలో

పీల్చేగాలి చెట్లకు
మనిషికి మారినట్లు
మనుషులంతా ఒకటే
కానీ చెట్లని ఒకటి కావు!!?

చీకట్లో ఇంద్రధనస్సులు విరిసినట్లు
చంద్రమండలంలో మూడు రంగుల జెండా విరిసింది!!?

స్వయం ప్రకాశం కోసం
గ్రహాలన్నీ
సత్యాగ్రహాలు చేయకుండానే
సూర్యుని వెంట తిరగబడీ
తమ చుట్టూ తాము తిరుగుతున్నాయి!!?

ఆకలేసిన కాకులు
రాత్రి ఉపవాసం ఉంటాయేమో కానీ
పగలు
అరుపులతో కరిచి చంపుతాయి!!?

యుద్ధాలన్నీ ఒకటే
రాతి యుగంలో ఆహారం కోసం
పారిశ్రామిక యుగంలో శ్రమ కోసం
శాస్త్ర సాంకేతిక యుగంలో ధనం కోసం
యుద్ధాలన్నీ ఒకటే!!?

ఎప్పుడూ ఓడిపోయింది నీతి
శ్రామిక జాతి!!?

ఈ గాలి ఈ నీరు ఈ భూమి
సమంగా పంచుకున్నది సమాజం కానీ
దేశ సంపదను మాత్రం పంచలేదు!!?

ఈ కులం ఈ మతం ఈ జాతి
సమంగా పంచుకున్నది సమాజం కానీ
దేశ సంపదను మాత్రం పంచలేదు!!?

జంతు సామ్రాజ్యంలో వృక్ష సామ్రాజ్యంలో
పరిణామ క్రమాలు ఉన్నాయి!!
ఫలితంగా
మానవుడు పుట్టిండు!!?

కానీ సామాజిక సామ్రాజ్యంలో
పరిణామక్రమాలు ఉండవు
రూపాంతరాలు మాత్రమే ఉంటాయి!!?
ఫలితంగా
అధికారం పుట్టింది
ధనం పుట్టింది
కీర్తి పుట్టింది!!?

తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం కోసం
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool much 🙏

కామెంట్‌లు