పిలుస్తోంది ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 ఎగురుతోంది ఎగురుతోంది
మువ్వన్నెల జెండా
భరతమాత ప్రాభవం 
ప్రతీకరా ఈజెండా
!! ఎగురు!!
వేదాలకు పుట్టినిల్లు
నాగరికత నేర్పినిల్లు 
దేవతలకు నిలయం
ముని ఋషుల ఆవాసం
జాతులూ, మతాలూ 
భాషలు వేరైనా
భిన్నత్వంలో
ఏకత్వం మనదేరా
!! ఎగురు!!
కదలిరా కదలిరా
భరత మాత ముద్దుబిడ్డ 
నీదేశం పిలుస్తోంది
నీతల్లీ పిలుస్తోంది
నీభూమిని రక్షించగ
యువతేజం పొంగిపొరలి
శతృమూక తరిమికొట్ట
రావాలిరా రావాలిరా
అందుకే ఈ జండాను పట్టగ
!! ఎగురు!!


కామెంట్‌లు