*దేశానికె ఖ్యాతిని తెస్తారు *(బాలగేయం ) కోరాడ నరసింహా రావు !
మీ మనోవికాసానికి కేవలం... 
   చదువేకాదు  పిల్లలూ... 
 మీరుఆటలతోపాటు,పాటలూ
నెర్చు కోవాలి... !
  
బొమ్మలు గియ్యటానికీ ఆసక్తిని  
   చూపాలి !
 మీలో ఆలోచనలను పెంచి... 
 సృజనాత్మకశక్తిని పెంపొందించే
బాలలకధలు,గేయాలు చదువు
తూ... మీరూ రాసే ప్రయత్నం     చేయాలి...  !
  
సంగీతం, నాట్యం,చిత్ర లేఖ నం,సాహిత్యం వీటన్నిటినీ లలి తకళలనీ అంటారు !  
 ఈలలిత కళలపై ఆసక్తి, మీలో
ఆలోచనలను రేకెత్తించి... 
 సృజనాత్మకతను కలిగిస్తుంది !

మీ మెదళ్లను పదునెక్కించి... 
  మిమ్ము  ప్రతిభావంతులుగా 
         మారుస్తుంది  !

ఎపుడూ... చదువూ- చదువని 
పిల్లలను వేధించకండి పెద్దలూ!
విసుగుచెందిన ఆ లేత మనసు లలో  ...నిరాసక్తత పుట్టి....
      నైరాశ్యాన్ని కలిగిస్తుంది... !

పిల్లలకు  చదువులలోనే కాదు 
ఆటలు, పాటలు, లలిత కళ ల 
పై ఆసక్తినిపెంచేలావారిని మీరు
ప్రోత్సహిస్తే,వారు మరమనుషు ల్లాకాక..సమర్ధంగాజీవించగలిగే 
గొప్ప వ్యక్తులే ఔతారు... !
   కన్నందుకు మీకే కాదు... 
     దేశానికే ఖ్యాతి తెస్తారు !!
     ******

కామెంట్‌లు