స్త్రీ జనోద్ధారకుడు ;-చంద్రకళ యలమర్తి--విజయవాడ
నడవరా తెలుగోడా..
మన గురజాడ వారి అడుగు జాడల్లో..
నవ్య దారుల్లో...

 స్త్రీ జాతికోసం నిరంతరం తపించి
అక్షర శరాలతో మెదళ్ళు కదిలించి
ఎన్నో మూఢ నమ్మకాలుతొలగించి

మరెన్నో అంధ విశ్వాసాలతో
సమాజం మగ్గుతున్నరోజుల్లో 
అతి దారుణమైన పరిస్థితులలో

బలిపశువులుగా మారినస్త్రీ జాతిని
బలి పీఠాలనుండి తప్పించి 
వారికి నూతన జీవితాలను ప్రసాదించిన గొప్ప సంఘ సంస్కర్త

స్త్రీ జనోద్ధారకుడు
 స్త్రీల రక్షణకై కంకణం కట్టుకున్న పురుషోత్తముడు
గొప్ప ఆదర్శ వాది

పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథ వినిపించాడు
అందరికళ్ళు తెరిపించాడు

బాల్యవివాహాలను అడ్డుకున్నాడు
సాంఘిక దురాచారాలను మట్టు పెట్టాడు 
స్త్రీల జీవితాలలో వెలుగులు నింపాడు

ఏదేశమేగినా...ఎందుకాలిడినా
నీ భూమి భారతిని పొగడ
మన్నాడు 
 నీ జాతి నిండుగౌరవం నిలప
మన్నాడు 

దేశమంటే మట్టికాదని 
దేశమంటే మనుషులని చాటి చెప్పాడు 
జాతిలో చైతన్య స్ఫూర్తిని నింపాడు

 ***


కామెంట్‌లు