సుప్రభాత కవిత ; బృంద
ప్రమోదాలు పలుకరించగ
ప్రతి అణువూ పులకరించగ

కరుణలన్నీ కిరణాలై
కణకణమూ స్పృశించగ

చెట్టు  చేమకు చిగురునిచ్చి
పుడమితల్లికి  పుష్థినిచ్చి

జీవజాలానికి జీవమిచ్చి
జలధరలకు జలమునిచ్చి

లోకానికి వెలుగునిచ్చి
జనులందరినీ మేలుకొలిపి

సృష్టి నంత రక్షించగ
దయాదృష్టి వర్శించగా

కాలచక్రము క్రమము తప్పక
ఋతు చక్రము తిరుగునట్లు

ధరణికి  గురువై
పరిక్రమలు చేయించుకుంటూ

ఆగమించిన లోకబాంధవా
అనుగ్రహమునకు కృతజ్ఞతతో

🌸🌸  సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు