సుప్రభాత కవిత ;-బృంద
నింగికి నేలకు వంతెనగా
కిందికి దిగినవి కిరణాలు

లెక్కకు మించిన శుభముల
తెచ్చే మధూదయ తరుణములు

తిమిరాన్ని తరిమేసే వెలుగులు
తిన్నగా చేరుకున్నవి భువనాలు

పచ్చగ మురిసిన హరితాలు
సుమాల నింపెను  పరిమళాలు

కురిపించుతున్న అనుగ్రహాలు
పొంగుతున్న ఆనందాలు

వసంతాలు శరత్తులూ
హేమంతాలు శిశిరాలు

అన్ని మార్పులకూ ఆలవాలమై
జగతిని నడిపే కరుణా వీక్షణాలు

క్షణక్షణం  నీరీక్షణలో మై మరచిన
మానసాన్ని మురిపించే  కటాక్షం

కలలోని సంబరాలు
ఇలపైకి మోసుకొచ్చు ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు