@ కల @
*****
నిద్దురలో కలలాంటిదే జీవితం
ఈ జీవుడికి చావే మెలకువ
జన్మ ఎత్తటమంటే....
ఆత్మ కల గనటమే !
*******
@ జ్ఞాని @
*****
జీవితమూ కేవలం ఓ కలేనని
పొందే సుఖదుఃఖాలన్నీ
వట్టి భ్రాంతులేనని....
గ్రహించే జ్ఞాని సాక్షీభూతుడై
చూస్తుంటే, అజ్ఞాని ఆ సుఖ దుఃఖాలకుపొంగి,క్రుంగుతున్నాడు !
*******
@ నిరంతర శాంతి @
*****
నిరంతర శాంతి కావాలంటే...
కర్మలు ఆగిపోవాల్సిందే !
కర్మలు ఆగాలంటే....
జన్మ ఆగిపోవాలి !
మృత్యువును జయించాలి
అంటే నీవునిజయోగివి కావాలి
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి