జాతీయ స్థాయి కవితా పోటీల్లో విజేతగా పిల్లి హజరత్తయ్య


 జాషువా సాహిత్య సాంస్కృతిక సంస్థ కందుకూరు వారు నిర్వహించిన జాతీయస్థాయి వచనకవితా పోటీలలో కవి, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీ పిల్లి హజరత్తయ్య గారు విజేతగా నిలిచారు.దాదాపు 200 మందికి పైగా కవులు పాల్గొన్న ఈ పోటీల్లో శ్రీ పిల్లి హజరత్తయ్య రచించిన హృదయమున్న కవి జాషువా అనే కవితకు తృతీయ బహుమతి దక్కింది. గుర్రం జాషువా 127 వ జయంతిని పురస్కరించుకుని కందుకూరు పట్టణంలో 27/9/22 వ తేదీన జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జాషువా సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో జాషువా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో జాతీయ స్థాయి కవితా పోటీలలో విజేతలైన వారికి కందుకూరు శాసనసభ్యులు శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి గారు చేతులు మీదుగా నగదు పారితోషికంతో పాటు,దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముప్పవరపు కిశోర్ అధ్యక్షత వహించారు. సీనియర్ కవులు బీరం సుందరరావు గారు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు