సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
చుట్టరికం... దాపరికం
   *****
 పుట్టుకతోనే అమ్మ,నాన్నల వైపు వాళ్ళతో కలిగి వుండే అనుబంధమే చుట్టరికం.
గతంలో చుట్టరికానికి పెద్ద పీట వేసే వారు.
ఇంట్లో ఏ చిన్న పండుగో, పబ్బమో, మంచో,చెడో ఏది జరిగినా చుట్టాలకు తెలియపరచడం ధర్మంగా ఉండేది.ఆఘమేఘాల మీద వచ్చేవారు. కష్టానికి సుఖానికి అన్ని  వేళలా తోడుగా వుండే వారు.*
వాళ్ళలో ఎవరో కొంతమంది జరుగుబాటు సరిగా లేని వారు మాత్రం రోజులు,నెలల తరబడి ఉండేవారు.కానీ మిగిలిన వారినుండి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందేవి.
ఎలాంటి దాపరికం లేని ఆనాటి బంధాలు, అనుబంధాల నడుమ పిల్లలు కూడా ఎంతో ఆరోగ్యకరంగా పెరిగేవారు.
సహకారం,సహానుభూతి, సంస్కారవంతమైన విలువలను తెలుసుకుంటూ జీవితానికి చక్కటి బాటలు వేసుకునేవారు.
 నేటి కుటుంబాల్లో దాపరికం ఎక్కువైంది. సంపాదనే ధ్యేయంగా ఉన్న కుటుంబాలు చుట్టరికాన్ని దూరంగా పెడుతున్నారు. వాళ్ళు తమ అభివృద్ధికి ఓర్చుకోలేరనే భావనలో ఉంటున్నారు.
దీనితో నేటి తరానికి చుట్టరికం అంటే ఏమిటో తెలియడం లేదు. అతి దగ్గరి చుట్టాలు ఎవరో కూడా తెలియకుండా పోతోంది.
కుటుంబం సమాజానికి దర్పణం కాబట్టి దాపరికం తగ్గించుకుని చుట్టరికానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఆత్మీయత అనుబంధాలు పెంచుకోవాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు