శిక్షణ!!;-సునీతాప్రతాప్, ఉపాధ్యాయిని, పిఎస్ నంది వడ్డెమాన్ బిజినేపల్లి మండల్ నాగర్ కర్నూల్ జిల్లా.
నోరు తెరిస్తే
కళ్ళు మూసుకుపోతాయి!
పుస్తకం తెరిస్తే
కళ్ళు తెరుచుకుంటాయి!!?

మానసిక వికాసం తో పాటు
మానసిక ఉల్లాసము ముఖ్యం!!
ఉల్లాసంతో జీవితం వికసిస్తుంది!
వికాసంతో మనిషి వికసిస్తాడు!!

ప్రతిభను
ప్రశంసించు ప్రేమించు కానీ
పూజించడం ప్రమాదకరం!!?

విద్య
నిన్ను నీ వ్యక్తిత్వాన్ని
మారుస్తుంది కానీ

ప్రపంచం నిన్ను తన అధీనంలోకి తీసుకుంటుంది!!
అంటే
తన శిక్షణ నీకు ఇస్తుంది!!
అది నీకు గొప్ప శిక్ష కూడా కావచ్చు!!
దీని నుంచి నీవు తప్పించుకోలేవు!!?

కామెంట్‌లు