సుప్రభాత కవిత ; -బృంద
చూపుల నిండా
ఆశల గమ్యం

కళ్ళ నిండా 
విజయపు కసి

గుండెనిండా
చెదరని ఆత్మవిశ్వాసం

బుర్ర నిండా 
అనుకూల ఆలోచనలు

పిడికిలిలో బిగించిన
ఉప్పెనంత ఉత్సాహం 

సత్తువను పెంచుతున్న
సంకల్పపు గుండె చప్పుడు

ఆశయ సిద్ధికై
ఆవహించిన పట్టుదల

కొండల్ని పిండి
చేయాలని చూసే రెక్కలబలం

స్థిరంగా సమతౌల్యంగా
సాగుతున్న ఆడుగులు

చీకటిగా తోచిన మేర
వెంటనే కనిపించే వెలుగుతోవ

విజయానికి చేరువ చేసే
వెలుగుల ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు