మనిషిదే కదా అదృష్టం... !(లలితగీతం :-) కోరాడ నరసింహా రావు !
పల్లవి :-
 అందమైన పావురం... 
  గొంతేంతో  కఠోరం !
   నల్లనికోయిల కూ తెంతో... 
          మధురము... !!
అందమైన రూపం ఉన్నా.... 
   హాయిగొలుపు గాత్రం లేదు !
తీయనైన కంఠం ఉన్నా... 
   చక్కనైన రంగు కాదు !!
       " అందమైన పావురం... "
అనుపల్లవి :- 
 చక్కని రూపం, తియ్యని పలు కుల చిలుకే కదా ముద్దు !
 రామచిలుకెంతో  ముద్దు !!.. 2
       "అందమైనపావురం... "
చరణం :-
స్వేచ్ఛగ ఎగిరే పావురాల గుంపులు..., మావి గుబురులో 
కుహు -కుహుమంటూతియ్యని
పాటల కోయిల... 2
  చక్కనిపలుకులుపలికే చిలుక
అందమైన అరవిరిసిన పూలు..
ఆమకరందాన్నిగ్రోలగా,పూలను
వీడక తిరిగే తుమ్మెదలు..., పచ్చదనాల కొండా, కోనలు... 
  పైనుండి దూకే జలపాతాలు 
   గల - గల పారే సెలయేళ్ళూ..
ప్రకృతి సోయగాలు ! 
  ఇవి ప్రకృతి సోయగాలు... !!
      " అందమైన పావురం... "
చరణం :-
   ఆ అందాలు, ఆనందాలు... 
   ఆస్వాదించి - అనుభూతించి 
పరవసించు మనిషిదేకదా... 
 అదృష్టం... !
 ఈ మనిషిదే కదా  అదృష్టం !!
 ఈ  మనిషిదే కదా  అదృష్టం!!!
      ******

కామెంట్‌లు