బోన్సాయ్ వృక్షము ;-ఎం. వి. ఉమాదేవి బాసర.
సమ్మోహనాలు (ముక్తపద గ్రస్థము)958
==============================
బోన్సాయి వృక్షములు 
వృక్షముగ చిత్రములు 
చిత్రమే ఎదుగుదల కుండీని ఓ వనజ !

ఒకమొక్క యెంచుకొని 
యెంచినది వంచుకొని 
వంచితీగలు చుట్టి అదుపులో ఓ వనజ !

కోరిన ఆకారము 
ఆకార నైపుణ్యము 
నైపుణ్యమొకకళగ భావించు ఓ వనజ !

మర్రి వూడలు పెట్టు 
పెట్టి విస్మయమట్టు 
విస్మయమె కలిగించు చిరుచెట్టు ఓ వనజ !

చిన్ని పూలను పూయు 
పూసి ఫలములు కాయు 
కాయడం వింతగా కనిపించు ఓ వనజ !

విదేశీ కళలుఇవి 
కళగాను తోచునివి 
తోచి అవార్డులునూ ఇచ్చునే ఓ వనజ !!


కామెంట్‌లు