తమిళ సాహిత్యంలో అనేకం రాసి ఖ్యాతి గడించిన వారున్నారు. అలాగే అతి తక్కువ రాసి మన్ననలు పొందిన వారూ ఉన్నారు. సంగ కాల సాహిత్యంలో కేవలం ఒకే ఒక్క పాటతో కీర్తిప్రతిష్ఠలు పొందారు కనియన్ పూన్కుడ్రనార్. త్రిసిరపురం మీనాక్షిసుందరం పిళ్ళయ్ లక్ష కవితలకుపైనే రాసి పేరుప్రఖ్యాతులు గడించారు. ఇక తమిళంలో చిన్న కథల విషయానికొస్తే అతి తక్కువగా ఇరవై నాలుగు కథలే రాసి నేటికీ
కొనియాడబడుతున్న రచయిత మౌని. ఆయన రాసిన ఈ కథలన్నీ రకరకాల మనసులను ప్రతిబింబించేవే. చిన్న కథల తిరుమూలర్ అని ప్రసిద్ధి పొందారు. ఆయన కథలు చదువుతుంటే ఓ కొత్త అనుభూతి కలుగుతుందని తమిళుల మాట. ఆయన చెప్పే కథ తీరు అమోఘమంటారు.
1907 లో తంజావూరు జిల్లా సెమ్మంగుడిలో పుట్టిన మౌని 1929లో తిరుచ్చి బిషప్ హీబర్ కాలేజీలో గణిత శాస్త్రం చదివి డిగ్రీ పొందారు.
కొన్నేళ్ళు కుంభకోణంలోనూ ఆ తర్వాత చిదంబరంలోనూ నివసించిన మౌనికి సంగీతమన్నా తత్వశాస్త్రమన్నా ఎంతో ఇష్టం.
"మణిక్కొడి" అనే పత్రికలో తొలిసారిగా రాసిన మౌని అసలు పేరు ఎస్. మణి. అయితే ఆయనకు మౌని అనే కలం పేరు పెట్టింది పి.ఎస్. రామయ్య.
కాలేజీ రోజుల్లో ఆయనను మిత్రులు " మైల్ మణి " అని పిలిచేవారు. కారణం - రన్నింగ్ రేస్ లో వేగంగా పరుగెత్తడమే.
మౌనితో కాస్సేపు అంటూ రచయిత దిలీప్ కుమార్ ఓ పుస్తకమే రాశారు.
మౌనితో అత్యంత సన్నిహితంగా మెలగిన వారిలో రచయిత జే.వి. నాథన్ ఒకరు. మౌని - నాథన్ ల మధ్య స్నేహం పదహారేళ్ళు కొనసాగింది. ప్రతి రోజూ కలుసుకునేవారు.
మౌని చిదంబరం ఆలయానికి వెళ్ళేవారు కానీ గుళ్ళో దేవుడికి దణ్ణం పెట్టేవారు కాదు.
ఎందుకు నమస్కరించరని నాథన్ అడగ్గా మౌనీ "నేనొక్క రోజు రాకపోయినా నటరాజస్వామిగానీ ఇతర దేవుళ్ళుగానీ ఇవాళ ఎందుకు రాలేదని నన్ను కోపగించుకుంటారు. అందుకే క్రమం తప్పకుండా గుడికొస్తాను. అంతేతప్ప నమస్కారం పెట్టలేదేమిటీ అని నిలదీయరు" అని నవ్వుతూ జవాబిచ్చారు. భగవంతుడినీ ఓ మంచి మిత్రుడిగా భావించేవారు మౌని.
మౌనికో అలవాటుండేది. ఆయన రాసిన ఏ కథకూ శీర్షిక పెట్టేవారు కాదు. కానీ ప్రతి కథనూ మళ్ళీ మళ్ళీ మార్చి మార్చి రాసేవారు.
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ నాథన్ తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారొక చోట.
ఓరోజు మౌని ఓ కథ రాయగా దానికి శుద్ధప్రతి రాసిపెట్టడానికి నాథన్ వెళ్ళారు. అయితే మౌని ఎన్నిసార్లు ఆ కథను మార్చి రాసారో చెప్పలేనన్నారు నాథన్. ఇంతకూ అది చిన్న కథే. దానికోసం రాత్రంతా నిద్రపోలేదు. ఓ దశలో నాథన్ కి సహనం నశించింది. కోపాన్ని దిగమింగుకున్నారు.
అప్పుడు నాథన్ వయస్సు ఇరవై రెండేళ్ళు. మౌని వయస్సు 64!! అయితే ఆయన మీద మర్యాదతో ఒక్క మాట అనకుండా రాయడం పూర్తయ్యేవరకూ ఓపికపట్టిన నాథన్ ఆయన తుది రూపమిచ్చిన కథకు శుద్ధ ప్రతి తయారుచేసారు.
అప్పుడు మౌని "నువ్వు ఫెయిర్ చేసింది నాకు చూపించక్కర్లేదు. తీసుకెళ్ళి పోస్ట్ బాక్సులో వేసేసే. ఎందుకంటే నాకు చూపించావనుకో మళ్ళీ ఏదో ఒక కొత్త ఆలోచన పుట్టి కథను మార్చాలనిపిస్తుంది" అన్నారట.
మాటల వాడుక విషయంలోనూ కథనంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు మౌని. తనకు తృప్తి కలిగే వరకూ కథలో మార్పులు చేర్పులూ చేస్తుండేవారు.
మౌని తాను రాసిన కథలను దాచుకునేవారు కాదు. ఎక్కువ చదివేవారు.
ఆయన ఇష్టపడి చదివే పుస్తకాలు తత్వశాస్త్రానికి సంబంధించినవే. ఆయన ఓ రచయిత అన్న విషయం సమీపబంధువులకెవరికీ తెలీనే తెలీదు.
మౌనికి వయోలిన్ వాయించడం తెలుసు. ఆయన దగ్గర ఓ వయోలిన్ ఉండేది. దానికో కథ ఉండేది. నాదాన్ని పుట్టించే తీగలకు బదులు కొబ్బరినార, సన్నపాటి నూలు వంటివి బిగించారు. వాటిమీద వాయిస్తూ అతి సన్నటి ధ్వని వచ్చేలా చూసుకునేవారు. తాను వాయించే వయోలిన్ ధ్వని భార్యకు ఇబ్బందిగా ఉండకూడదనుకునేవారు.
మౌని దంపతులకు నలుగురు కొడుకులు. ఒక కుమార్తె. మొదటి కుమారుడు చెన్నైలో రోడ్డుప్రమాదంలో చనిపోయాడు. ఇంజనీరుగా పని చేసిన రెండవ కుమారుడు అనుకోని ఘటనలో స్నానాల గదిలో కరెంట్ షాక్ కు గురై మరణించాడు. మూడో కుమారుడు తత్వశాస్త్రం చదువుకున్నాడు. కానీ మానసిక స్థితి సరిగ్గాలేక ఇంటిపట్టునే ఉండేవాడు. అతని గురించి జీవితాంతమూ ఆలోచిస్తూ బాధపడుతూనే ఉండేవారు.
ఇక నాలుగో కుమారుడు అమెరికాలో ఉన్నారు.
"అనుభవాలను చక్కగా చిక్కగా చెప్పడం ఓ కళ. అనుభవాన్ని కాగితంమీద పెడుతున్నప్పుడు అనుభూతి కలిగించేలా రాయాలి. నిజమైన రచయిత నిజాయితీతో అనుభవాన్ని చెప్పేటప్పుడు మాటలు తానుగా వస్తాయి" అనేవారు మౌని. ఓ రచయితకు ఏది రాయాలనేది తెలియడంకన్నా ఏది రాయకూడదు అనేది తప్పకుండా తెలిసుండాలని ఆయన అభిప్రాయం.
ఆల్బర్ట్ ఫ్రాంక్లిన్ అనే అమెరికన్ మేధావి ఓసారి మౌనిని కలిసి "మీరెందుకోసం రాస్తున్నారు?" అని అడిగినప్పుడు మౌని "నేను రాయకుండా ఉండలేను. అందుకే రాస్తున్నాను" అని జవాబిచ్చారు.
పేరులోనే మౌని తప్ప ఆయన ఎంతో మాట్లాడేవారు. మాట్లాడటం వల్ల తనను తాను స్పష్టతకు రావచ్చని అనుకునేవారు.
అంతేతప్ప ఎదుటివారికోసం కాదని చెప్పేవారు.
ఏది మంచి కథ అని అడిగినప్పుడు "ఓ మంచి చిన్న కథ అనేది ఓ కవిత. నేను రాసిన చిన్న కథలన్నీ కవితలే" అన్నారు మౌని.
టాల్ స్టాయ్, ఇప్సన్, అనతోల్ ఫ్రాన్స్, ఆంటన్ చెకావ్ తదితరుల రచనలంటే ఆయనకెంతో ఇష్టం.
మౌని రాసిన కథలన్నీ 1936, 37 లలో రాసినవేనని పరిశోధకుల మాట. 1960లలో ఆయన రాయడం మానుకున్నారు. 1985 జూన్ ఆరవ తేదీన కాలధర్మం చెందారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి