ఆంగ్ల సాహితీ వేత్తలు! అచ్యుతుని రాజ్యశ్రీ
 లియోటాల్ స్టాయ్ భూస్వామ్య కుటుంబం లో పుట్టాడు.బాల్యం లో అనాధ ఐన దురదృష్ట వంతుడు.సరైన ఆలనాపాలనాలేక అల్లరి చిల్లర గా తిరిగి ఆఖరికి సైన్యంలో చేరాడు. అప్పుడే "ఛైల్డ్ హుడ్"అన్న అతనిరచన వెలుగులోకి వచ్చింది. 34వ ఏట 18ఏళ్ళ సాన్యాని పెళ్లాడి 13మంది పిల్లల తండ్రి అయ్యాడు.కానీ ఏదో అశాంతి!83వ ఏట  ఇల్లు వదిలి ఓచిన్న రైల్వే స్టేషన్ లో కన్ను మూశాడు.సాన్యా  భర్త రాసిన "వార్ అండ్ పీస్"నవలను 7సార్లు సవరించిరాసింది! నిజంగా  ఆమెకు జోహార్లు!
హెచ్.జి.వేల్స్ తల్లి దండ్రులు కీచులాటల్లో ఫైటింగ్ చేస్తూ ఉంటే పాపం చిన్నారి వేల్స్ పగటి కలలు కంటూ పుస్తకాలలో మునిగేవాడు.
సాహిత్య సమావేశాల్లో చలోక్తులు నవ్వులతో అందరినీ ఆకట్టుకున్న  ఇబ్సన్ ప్రసిద్ధ నాటకకర్త! నార్వేలో నిరుపేద కుటుంబం లో పుట్టాడు. 6గురి సంతానం లో పెద్ద కొడుకు!16వ ఏటనే కెమిస్ట్ గా పనిచేస్తూ  బొమ్మలు గీసేవాడు.కవితలల్లేవాడు. 63 వ ఏట అంతర్జాతీయంగా కీర్తి గడించాడు. దానితో ఆడంబరం గా తయారై కోటుపై తనకు వచ్చిన  మెడల్స్  తగిలించి సిల్కుటోపి బంగారు కళ్ళజోడు తో ట్రిమ్ గా తయారై అందరినీ  ఆకట్టుకునేవాడు.
కొలెట్టి ప్రసిద్ధ ఫ్రెంచ్ రచయిత్రి. 63పుస్తకాలు రాసింది.20వ ఏట35ఏళ్ల  విల్లార్స్ అనే రచయితను పెళ్లాడింది.తను రాసే కథలు నవలలకు కొలెట్టివిల్లి అని భర్త పేరు ని జతచేసింది.విడాకులు తీసుకున్న తర్వాత పుంఖానుపుంఖాలుగా ఆమెకలం నించి రచనలు వెల్వడ్డాయి.తన72వ ఏట"గిగి"అనే రచనచేసింది.ఆమె ఎలా రాసేదే తెలుసా?పడకపై కూచుని  చుట్టూ కుషన్ దిండ్లు(తలగడలు) పిల్లులను కూలేసి అవి మ్యావ్ మ్యావ్ అని అరుస్తూ ఉంటే ఆమెకి భావాల ఊట పైకి తన్నుకొచ్చేదిట!!
అలెగ్జాండర్ డ్యుమాస్ ప్రసిద్ధ ఫ్రెంచ్ రచయిత! బాగా డబ్బు సంపాదించి బాగా సద్వినియోగం చేసేవాడు.ఆకలితో అలమటించే కళా కారులు  పిల్లరచయితలకు సాయం చేసేవాడు.అతని ఇల్లు ఓధర్మసత్రం🌷

కామెంట్‌లు