చాడీలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆఅడవిలో బొద్దుగా ముద్దు గా ఓకుందేలు ఉంది. దాన్ని ఎలాగైనా  గుటకాయస్వాహా చేయాలని  నక్క  ఉబలాటపడుతూ తెగ ప్రయత్నాలు చేస్తోంది. అందుకే  దానితో దోస్తీ కట్టి దాన్ని బుట్టలో వేసే ప్రయత్నాలు ముమ్మరంగా ఆరంభించింది.ఇది గమనించిన కాకి కుందేలు తో"నక్క మహాజిత్తులమారిది.దానికి చాలా దూరం గా ఉండు.నీమీద పితూరీలు చాడీలు చెప్తోంది. రైతుల పొలాల్లో నీవు తోటికుందేళ్లతో కల్సి అక్కడి ధాన్యం  దుంపలు  అన్నీ మెక్కుతున్నావట! మీతో పాటు ఎలుకలు కూడా చేరి పంట నాశనంచేస్తున్నాయని ప్రచారం చేస్తోంది. రైతులకి  మీమీద విషంనూరిపోస్తోంది.అందుకే  రైతులు  విషం కలిపి వలలు పన్ని బోనులు పెట్టి  నానా తంటాలు పడుతున్నారు. పొరపాటున కూడా  నీవు  ఆపొలం వైపు వెళ్లకు.మీవాళ్లందర్నీ హెచ్చరించు ". వెంటనే తెలివిగల కుందేలు ఏమందో తెలుసా?"అవును!జంతువులకన్నా హీనంగా మారిన మానవుడు  తను కల్తీ ఆహారపదార్థాలు  పాలలో రసాయనాలు కల్పి అమ్ముతున్నాడు.ఐనా జనం పట్టించుకోరు.చట్టాలు అన్నిరకాల కల్తీలు చెక్ చేసేందుకు  అధికారులు ఉన్నారు. కానీ  ఏంలాభం? సిమెంట్ కల్తీ !అక్రమ కట్టడాలు  భూ కబ్జాలు చెరువుల ఆక్రమణ రసాయనాలు నీటిలో వదలటం గుంటలు పూడ్చకపోటం-ఇన్ని అవినీతి పనులు చేస్తూ మానోరులేని జీవుల పై అక్రమంగా దాడిచేసి చంపుతున్నారు. కుందేలు మాంసం తింటూ మాచర్మంతో హాండ్ బ్యాగ్ లు తయారు చేసి వందలాది రూపాయలు గడిస్తున్నారు. మేమంతా మాయమైనాక తెలిసొస్తుంది మనిషికి మావిలువ! ఒకరిమీద ఒకరు చాడీలు అక్రమ కేసులు బనాయించే మొనగాళ్ల కన్నా నక్క నయం." అంతే కాకి నోరు కూడా మూతబడింది🌹
కామెంట్‌లు