వ్యాపారం! అచ్యుతుని రాజ్యశ్రీ

 అనేక వృత్తులలో వ్యాపారం ఒకటి. ఎంతో తెలివి చాకచక్యంగా చేస్తేనే ఆవ్యక్తి రాణిస్తాడు.అలాగని  ఒకరిని మోసం చేసి ఎక్కువ ధరలకు అమ్మటం బ్లాక్ మార్కెట్ వ్యాపారం  వస్తువుల కల్తీ ససేమిరా కూడదు.తాత్కాలికంగా  మనం గొప్పవారం కావచ్చు నేమో కానీ  ఆపాపం కట్టి కుదుపుతుంది.నీతినిజాయితీ మానవత్వం  ఉండాలి సుమా! మోసానికి మోసమే ఫలం! ఆఊరి నారయ్య మొదట్లో నీతినిజాయితీగా పాలుపెరుగు అమ్మేవాడు.అంతా అతనిదగ్గర కొనేవారు.కానీ కొన్నాళ్ళకి డబ్బు ఆశ పెరిగింది. పిల్లాడిని ఓగొప్ప కార్పొరేట్ బడిలో వేశాడు. వాడు టకటక ఇంగ్లీషు మాట్లాడటం ఆటల్లో బహుమతులు తెచ్చుకోవడం చూసి పొంగిపోయాడు. కానీ వాడి చదువు సంగతి పూర్తిగా  పట్టించుకోటం మానేశాడు.తను కూడా పాలు పెరుగులో రసాయనాలు కల్పుతూ డబ్బు ఎక్కువ గుంజుతున్నాడు.ఓసారి  ఆరసాయనపాలు పెరుగు హాస్టల్ కి పంపాడు.చాలా మంది పిల్లలు వాంతులతో బాధ పడటంతో ఆసుపత్రి లో చేర్చారు. కానీ లంచాలు మరిగిన అధికారులు  కల్తీ కారణం కాదని కితాబు ఇచ్చారు.ఈసారి నారయ్య ఓకొత్త దంధా మొదలు పెట్టాడు."నాకు హిమాలయాల లో ఉండే ఓయోగి నేను నెలక్రితం కాశీ వెళ్లినపుడు మూలికలతో చేసిన పొడుం ఇచ్చాడు. అది చిటికెడు రాత్రి పడుకునే ముందు పాలలో వేసుకుని తాగితే హాయిగా నిద్ర పడుతుంది. ఎలాంటి చీకు చింతలు రోగాలు మటాష్ అవుతాయి " అని  ఓచెంచా పొడుంని పొట్లాలు గాకట్టి ఒక్కొక్క పొట్లాం వంద రూపాయలకి అమ్మసాగాడు.ఆమాదక ద్రవ్యానికి అంతాఅలవాటు పడ్డారు. ఓరోజు హఠాత్తుగా  కొడుకు గదిలోకి అడుగు పెట్టాడు. వాడు ఓచిన్న పొట్లంలోని పొడిని నోట్లో వేసుకుని హాయిగా కూనిరాగాలు తీస్తూ గంతులేస్తూ ఉన్నాడు.అంతే గదిలోకి  జొరబడి"బాబూ! ఏంటిరా చప్పరిస్తున్నావు?" అని అడిగాడు. "నాన్న! నిన్న మాఫ్రెండ్ పుట్టిన రోజు!అందరికీ గిఫ్ట్ తో పాటు  ఈపొట్లాలు రెండు ఇచ్చాడు.ఇవి నోట్లో వేసుకుంటే బాగా యాక్టివ్ గా తయారు అవుతాంట! చురుగ్గా ఆలోచిస్తూ చదవకుండానే వినటంతోనే మైండ్ లో రికార్డ్ అవుతాయిట!"అని చెప్పాడు. ఆపొట్లాలు తను వంద రూపాయలకి అమ్మేమత్తు పదార్ధం!అంతే నిలువు గుడ్లేసుకుని  ఏడో క్లాస్ చదివే కొడుకు వైపు అలా చూస్తూ ఉండిపోయాడు 🌹
కామెంట్‌లు