సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 దాస్యం.‌...దాసోహం
******
దాస్యం, దాసోహం ఇవి రెండూ మనిషికి వ్యక్తిత్వానికి అగ్ని పరీక్షలు. అస్తిత్వం ఎలాంటిదో తెలిపే సూచికలు. 
దాస్యం అంటే  పూర్తిగా లొంగిపోయి, బానిసగా  అస్వతంత్రంగా బతకడం, ఊడిగం చేయడం.
ఇక్కడ వ్యక్తికి ఎలాంటి స్వంత అభిప్రాయాలకు, ఆలోచనలకు తావు లేదు.,స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకునే హక్కు ఉండదు.
ఇతరుల అధికారం, ఆధిపత్యం కింద తలవొంచుకుని బతకడమే దాస్యం.
ఈ దాస్యానికి బానిసత్వం,కట్టుబాటు, నిర్భంధం,పరతంత్ర్యం అనే అర్థాలు కూడా ఉన్నాయి.
 దాస్యంలో దాస్య భక్తి అనేది ఒక రకమైన భక్తి.
 తమంతట తామే ఇచ్ఛాపూర్వకంగా పెద్దవాళ్ళకు, రోగులకు, తమకు నచ్చిన దైవాలకు మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా చేసే దాస్యాన్ని దాస్య భక్తి అంటారు.
ఇక దాసోహం అంటే ఇష్టంగా తల ఒగ్గడం లేదా, లొంగిపోవడం.
అరిషడ్వర్గాలైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాల ఆకర్షణకు లోనై వ్యక్తిత్వాన్ని స్వాభిమానాన్ని కోల్పోవడమే దాసోహం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు