మహిలదో మహాకావ్యం @ కోరాడ నరసింహా రావు
అనాదిగా... మహిళ  జీవితం 
  వ్రాసుకుంటే  ఓ మహాకావ్యమే 

ఓ సీత... ఓ ద్రౌపది...! మొదలు
నేటి ఆధునిక మహిళ వరకూ... 
 త్రేతాయుగంలో  సీతది ఓ కథ!
ద్వాపరంలో ద్రౌపదిది ఓ కథ..!!
ఐతే... ఈ కలియుగంలో... 
  మహిళది లక్షమంది సీతలు... 
    కోటిమంది ద్రౌపదుల కధలు 
         చాలవు కదా ... !
అనాదిగా... అవహేళనలు !
  అనగ ద్రొక్కే ఆచారాలు !!
   నేటి ఆధునిక మహిళ...ఎన్ని
అవరోధాలనాధిగమించిందని !

జన్మపూర్ణత్వసాఫల్యాన్నిసాధిం
చినా..ఆడదిఅబలకాదు,సబల
అని నిరూపించుకున్నా...., 
    అడుగడుగు అవమానాలకు బరితెగించిన పురుష ప్రపంచం 
ఇంకా...తన మాన,ప్రాణాల తో 
ఆదుకోవటాన్ని ప్రశ్నిస్తూ,రాసిన 
స్త్రీ జాతి జీవిత చరిత్రతో... 
    యుద్ధం ప్రకటిస్తూ ముందుకు  కదులుతోంది నేటి మహిళ !! 
     ******

కామెంట్‌లు